జిల్లా షటిల్‌ జట్టుకు అమ్మవారిపాలెం విద్యార్థినుల ఎంపిక

ABN , First Publish Date - 2022-12-16T23:04:37+05:30 IST

నెల్లూరులోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో శుక్రవారం జరిగిన పోటీల్లో ప్రతిభ కనబరచిన అమ్మవారిపాలెం విద్యార్థినులు జిల్లాస్థాయి స్కూల్‌ గేమ్స్‌ అండర్‌ 14, అండర్‌ 17 బ్యాడ్మింటన్‌ (షటిల్‌) జట్టుకు ఎంపికయ్యారు.

జిల్లా షటిల్‌ జట్టుకు అమ్మవారిపాలెం విద్యార్థినుల ఎంపిక
జిల్లా షటిల్‌ జట్టుకు ఎంపికైన విద్యార్థినులు

పొదలకూరు, డిసెంబరు 16 : నెల్లూరులోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో శుక్రవారం జరిగిన పోటీల్లో ప్రతిభ కనబరచిన అమ్మవారిపాలెం విద్యార్థినులు జిల్లాస్థాయి స్కూల్‌ గేమ్స్‌ అండర్‌ 14, అండర్‌ 17 బ్యాడ్మింటన్‌ (షటిల్‌) జట్టుకు ఎంపికయ్యారు. పదో తరగతి చదువుతున్న అంతటి తేజ, 9వతర గతి చదువుతున్న నాగినేని పల్లవి ఆటలో ఉత్తమ ప్రతిభ కనపరచి జిల్లా జట్టుకు ఎంపికయ్యారని ఆ పాఠశాల ఫిజికల్‌ డైరెక్టర్‌ సురేంద్రకుమార్‌ తెలిపారు. అండర్‌-14కు ఎంపికైన పల్లవి, మదనపల్లిలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో, అండర్‌ -17కు ఎంపికైన అంతటి తేజ, కడప సిటీలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలో పాల్గొంటారని తెలిపారు. ఎంపికైన వారిని పాఠశాల హెచ్‌ఎం విజయకుమార్‌, ఉపాధ్యాయులు శ్రీహరిరెడ్డి, వెంకటరెడ్డి, సుభాషిణి, గౌస్‌, అభినందనలు తెలిపారు.

Updated Date - 2022-12-16T23:04:39+05:30 IST