పాఠశాల విలీనాన్ని రద్దు చేయాలని ఆందోళన
ABN , First Publish Date - 2022-07-16T05:31:14+05:30 IST
పట్టణంలోని ఇస్కాలవారి వీధిలో ఉన్న అభ్యుదయ పాఠశాల విద్యార్థులతో కలిసి ఎస్‌ఎఫ్‌ఐ కందుకూరు డివిజన్
కందుకూరు, జూలై 15: పట్టణంలోని ఇస్కాలవారి వీధిలో ఉన్న అభ్యుదయ పాఠశాల విద్యార్థులతో కలిసి ఎస్‌ఎఫ్‌ఐ కందుకూరు డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. నెల్లూరు జిల్లా కార్యదర్శి పి.శ్రీనివాసులు మాట్లాడుతూ పేద చిన్నారుల ఉన్నత విద్యను నిర్వీర్యం చేసే జీవో 117ను వెంటనే రద్దు చేయాలని కోరారు. 154 మందికి పైగా పాఠశాలను 2 కి.మీ దూరంలోని హైస్కూల్‌లో విలీనం చేయటానికి సిద్ధమ వుతున్నారని 1,2 తరగతులను ఎలిమెంటరీ అంగన్‌వాడీ కేంద్రంలో కలిపేందుకు ఇప్పటికే సిద్ధమైనందున ఈ పాఠశాల రద్దయినట్లేనని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రయత్నాన్ని విరమించుకుంటున్నామని అధికారులు స్పష్టమైన హామీ ఇవ్వకపోతే ఆందోళనను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు శ్రీహర్ష, వాసు, సాల్మన్ రాజు, సుమంత్ తదితరులు పాల్గొన్నారు.