రాష్ట్ర ప్లీనరీ విజయవంతానికి కృషి చేయండి

ABN , First Publish Date - 2022-07-06T04:42:34+05:30 IST

గుంటూరులో ఈనెల 8, 9తేదీల్లో జరిగే వైసీపీ రాష్ట్ర ప్లీనరీ సమావేశాల విజయవంతానికి కృషి చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, ఎంపీ, వైసీపీ జిల్లా అధ్యక్షుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి సూచించారు.

రాష్ట్ర ప్లీనరీ విజయవంతానికి కృషి చేయండి
సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి కాకాణి, ఎంపీ వేమిరెడ్డి

రాష్ట్ర ప్లీనరీ విజయవంతానికి కృషి చేయండి

మంత్రి కాకాణి, ఎంపీ వేమిరెడ్డి

నెల్లూరు (జడీ ్ప) జూలై 5 : గుంటూరులో ఈనెల 8, 9తేదీల్లో  జరిగే వైసీపీ రాష్ట్ర ప్లీనరీ సమావేశాల విజయవంతానికి కృషి చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి,  ఎంపీ,  వైసీపీ జిల్లా అధ్యక్షుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి సూచించారు. వేమిరెడ్డి కార్యాలయంలో మంగళవారం జిల్లా ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో రాష్ట్ర ప్లీనరీపై చర్చించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమావేశాలను విజయవంతం చేసేందుకు జిల్లా నుంచి అందరి భాగస్వామ్యం కావాలన్నారు. నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలు ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. సమావేశంలో నెల్లూరు, కోవూరు, వెంకటగిరి, ఆత్మకూరు,  కందుకూరు, ఉదయగిరి ఎమ్మెల్యేలు అనిల్‌కుమార్‌యాదవ్‌, నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, మేకపాటి విక్రమ్‌రెడ్డి, మహీధర్‌రెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, ఎమ్మెల్సీ బల్లి కల్యాణ్‌చక్రవర్తి, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డి పాల్గొన్నారు. 

Read more