వెంకటగిరే రాష్ట్ర రాజధాని

ABN , First Publish Date - 2022-11-30T23:26:28+05:30 IST

డైలమాలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం వెంకటగిరిని రాజధానిగా ప్రకటించాలని మాజీ ఎంపీ, కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత చింతా మోహన్‌ అన్నారు.

వెంకటగిరే రాష్ట్ర రాజధాని
రాపూరు ఎస్సీ కాలనీలో మహిళలతో మాట్లాడుతున్న చింతా మోహన్‌

రాపూరు, నవంబరు 30: డైలమాలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం వెంకటగిరిని రాజధానిగా ప్రకటించాలని మాజీ ఎంపీ, కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత చింతా మోహన్‌ అన్నారు. రాపూరు దళితవాడలో బుధవారం ఆయన జోడో యాత్ర కరపత్రాలు ఇంటింటికి పంపిణీచేసి మహిళలతో మాట్లాడారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ బ్రహ్మంగారు కాలజ్ఞానంలో వెంకట గిరి రాజఽధానిగా అవుతుందని ఎప్పుడో చెప్పారని, అందువల్ల వెంకటగిరి రాజధాని అయ్యో అవకాశాలు మెండుగా ఉన్నాయన్నారు. తాజాగా వచ్చిన కోర్టు తీర్పుతో ప్రభుత్వ పెద్ద సజ్జల రామకృష్ణ రెడ్డి రాజధాని విషయంలో సందిగ్ధంగా ఉన్నట్లు తేటతెల్లమవుతోందన్నారు. రాపూరు ఏర్పేడు పరిధిలో సుమారు లక్ష ఎకరాల ప్రభుత్వ భూమి నిరుపయోగంగా ఉందన్నారు. వెంకటగిరి చెంతనే రేణిగుంటలో అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు, ఏడు యూనివర్సిటీలు, ఏడు ఎన్‌హెచ్‌లు, పేరెన్నిగన్న ఆసుపత్రులు, తిరుపతిలో విద్యాసంస్థలు ఉన్నాయన్నారు. కండలేరు జలాశయం నుంచి మూడు జిల్లాల సెజ్‌ల దాహార్తి తీర్చే మంచినీటి పథకం మూలపడిందని, దీంతో పైపులు రోడ్డుమీద పడిఉ న్నాయన్నారు. మన్నవరం, బెల్‌ కంపెనీలు ఒక్క కాంగ్రెస్‌ పార్టీ విజయంతోనే

Updated Date - 2022-11-30T23:26:29+05:30 IST