కావలిలో స్పీకర్‌ తమ్మినేనికి సత్కారం

ABN , First Publish Date - 2022-08-16T04:27:56+05:30 IST

శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారాంను సోమవారం సాయంత్రం కావలిలో ఎమ్మెల్యే ప్రతాప్‌కుమారెడ్డి ఆధ్వర్యంలో పలువురు అధికారులు, వైసీపీ నేతలు సత్కరించారు.

కావలిలో స్పీకర్‌ తమ్మినేనికి సత్కారం
స్పీకర్‌ తమ్మినేనితో మాట్లాడుతున్న ఎమ్మెల్యే ప్రతాప్‌కుమార్‌రెడ్డి

కావలి, ఆగస్టు 15: శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారాంను సోమవారం సాయంత్రం కావలిలో ఎమ్మెల్యే ప్రతాప్‌కుమారెడ్డి ఆధ్వర్యంలో పలువురు అధికారులు, వైసీపీ నేతలు సత్కరించారు. తమ్మినేని తనయుడికి ఇటీవల వివాహం కావడంతో వెంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు కుటుంబసభ్యులతో కలిసి ఆయన తిరుమలకు బయలు దేరారు. మార్గమధ్యంలో కావలి పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ రూము అతిథి గృహంలో విశ్రాంతి తీసుకున్నారు. కావలి ఎమ్మెల్యే ప్రతాప్‌కుమార్‌రెడ్డికి తన అనుచరులతో అతిథి గృహం వద్దకు వచ్చి ఆయనకు స్వాగతం పలికి శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో కావలి ఆర్డీవో శీనానాయక్‌, ఇన్‌చార్జి డీఎస్పీ కండే శ్రీనివాసులు, మున్సిపల్‌ కమిషనర్‌ బీ. శివారెడ్డి, తహసీల్దార్‌ మాధవరెడ్డి, వైసీపీ నాయకులు కేతిరెడ్డి శివకుమార్‌రెడ్డి, జనిగర్ల మహేంద్రయాదవ్‌, జంపాని రాఘవులు, అమరా వేదగిరి, కేతిరెడ్డి జగదీష్‌రెడ్డి, తిరువీది ప్రసాద్‌, పండిటి కామరాజు, కుందుర్తి శ్రీనివాసులు, కనపర్తి రాజశేఖర్‌, షాహుల్‌ హమీద్‌, కలికి శ్రీనివాసులు రెడ్డి,డేగా రాము తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-08-16T04:27:56+05:30 IST