ఉప రాష్ట్రపతి పర్యటనపై రూట్‌ మ్యాప్‌ ఎస్పీ పరిశీలన

ABN , First Publish Date - 2022-04-25T04:23:14+05:30 IST

మండలంలోని ఇందుపూరు కాలువ సమీపంలో ఉన్న దేవిరెడ్డి శారద చారిటబుల్‌ ట్రస్ట్‌ను ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు ఈనెల 27న సందర్శించనున్నారు.

ఉప రాష్ట్రపతి పర్యటనపై రూట్‌ మ్యాప్‌ ఎస్పీ పరిశీలన
ట్రస్ట్‌లోని పాఠశాల విభాగాన్ని పరిశీలిస్తున్న ఎస్పీ విజయరావు

అల్లూరు, ఏప్రిల్‌ 24 : మండలంలోని ఇందుపూరు కాలువ సమీపంలో ఉన్న దేవిరెడ్డి శారద చారిటబుల్‌ ట్రస్ట్‌ను ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు ఈనెల 27న  సందర్శించనున్నారు. ఈ నేపథ్యంలో రూట్‌ మ్యా్‌పను జిల్లా ఎస్పీ సీహెచ్‌.విజయరావు ఆదివారం పరిశీలించారు. జాయింట్‌ కలెక్టర్‌ హరేందిర ప్రసాద్‌తో కలిసి ట్రస్ట్‌ పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపరాష్ట్రపతి పర్యటనలో ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ట్రస్ట్‌ సభ్యులు దేవిరెడ్డి దశరథరామిరెడ్డి, ట్రస్ట్‌ సీఈవో దేవన్‌కుమార్‌, మేనేజర్‌ అనిల్‌కుమార్‌రెడ్డిలకు సూచించారు. ఉపరాష్ట్రపతి ట్రస్ట్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన దేవిరెడ్డి శారద శిలాఫలకాన్ని ఆవిష్కరించే ప్రాంతంతోపాటు ఆయన పర్యటించే ప్రాంతాలను ఆయన సందర్శించి భద్రత ఏర్పాట్లుపై తమ సిబ్బందికి వివరించారు. పాఠశాల విభాగం, హాస్పిటల్‌, స్కిల్‌ డెవల్‌పమెంట్‌ సెంటర్‌ల సందర్శన అనంతరం నిర్వహించే సభా వేదికను ఆయన పరిశీలించి ఉపరాష్ట్రపతి ఏ మార్గం ద్వారా వెళ్లనున్నారో తదితర వాటిపై చర్చించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్‌ ఎస్పీ వెంకటరత్నం, ఏఆర్‌ అడిషనల్‌ ఎస్పీ జి.శ్రీనివాసరావు, డీఎస్పీ హరనాథరెడ్డి, కావలి ఆర్డీవో శీనానాయక్‌, సీఐ రామకృష్ణారెడ్డి, తహసీల్దారు శ్రీరామకృష్ణ, ఆర్‌ఐ.సుధీర్‌, ఎస్‌ఐ శ్రీనివాసులురెడ్డి, ఎంపీడీవో నగే్‌షకుమారి, తదితరులు పాల్గొన్నారు.

Read more