వివిధ రూపాల్లో ఆదిమాత దర్శనం

ABN , First Publish Date - 2022-09-29T05:21:50+05:30 IST

శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా బుధవారం పట్టణంలోని శివాలయంలో అన్నపూర్ణాదేవి ప్రత్యేక అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.

వివిధ రూపాల్లో ఆదిమాత దర్శనం
ప్రత్యేక అలంకరణలో అన్నపూర్ణాదేవి

ఘనంగా శరన్నవరాత్రి వేడుకలు


ఆత్మకూరు, సెప్టెంబరు 28 : శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా బుధవారం   పట్టణంలోని శివాలయంలో అన్నపూర్ణాదేవి ప్రత్యేక అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ పూజారి శివకుమార్‌శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. శ్రీవాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయంలో అమ్మవారు రాజరాజేశ్వరీ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారికి ఆలయ అర్చకులు శ్రీవాసవీ అష్టోత్తరములు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే తిరునాళ్లతిప్పలోని కాశీనాయన ఆశ్రమ ఆవరణలో వెలసి ఉన్న ఆలయంలో శరన్నవరాత్రి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కాగా ఉత్తర బలిజవీధిలో వెలసిన జ్వాలాముఖి ఆలయంలో ప్రత్యేక అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం అర్చకులు  అభిషేకం, శ్రీదేవి ఖడ్గమాల విశేష పూజలు, కుంకుమార్చన నిర్వహించారు. 

Read more