విద్యార్థులు సేవా దృక్పథం అలవర్చుకోవాలి

ABN , First Publish Date - 2022-09-25T03:07:42+05:30 IST

విద్యార్థులు సేవా దృక్పఽథాన్ని అలవరచుకోవాలని మున్సిపల్‌ వైస్‌చైౖర్మన్‌, అభిరామ్‌ ఆసుపత్రి అధినేత డాక్టర్‌ కేవీ శ్రావణ్‌కుమా

విద్యార్థులు సేవా దృక్పథం అలవర్చుకోవాలి
డాక్టర్‌ శ్రావణ్‌కుమార్‌ దంపతులను సన్మానిస్తున్న కరస్పాండెంట్‌ సుబ్బారెడ్డి

ఆత్మకూరు, సెప్టెంబరు 24 :  విద్యార్థులు సేవా దృక్పఽథాన్ని అలవరచుకోవాలని మున్సిపల్‌ వైస్‌చైౖర్మన్‌, అభిరామ్‌ ఆసుపత్రి అధినేత డాక్టర్‌ కేవీ శ్రావణ్‌కుమార్‌, డాక్టర్‌ మేకపాటి దీప్తి తెలిపారు. స్థానిక ఏఎస్‌ఆర్‌ డిగ్రీ కళాశాలలో శనివారం ఏర్పాటు చేసిన ఎన్‌ఎస్‌ఎస్‌ ఆవిర్భావ దినోత్సవానికి వారు ముఖ్య అతిఽథులుగా పాల్గొని ప్రసంగించారు. ఏఎస్‌ఆర్‌ డిగ్రీ కళాశాల చేపట్టిన సేవా కార్యక్రమాలను దృష్టిలో ఉంచుకుని వీఎస్‌యూ రెండవ యూనిట్‌ను కూడా ఇవ్వడం అభినందనీయమన్నారు.  విద్యార్థులకు  తలెత్తే ఆరోగ్య సమస్యలు, వాటి నివారణ చర్యలను వారు వివరించారు. అనంతరం కళాశాల యాజమాన్యం వారిని ఘనంగా సన్మానించింది. ఈ కార్యక్రమంలో ఏఎస్‌ఆర్‌ డిగ్రీ కళాశాల యాజమాన్యం, ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగామ్‌ ఆఫీసర్స్‌, అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.


Read more