పొరుగా రాష్ట్రాల మద్యంపై నిఘా

ABN , First Publish Date - 2022-11-28T22:55:08+05:30 IST

పొరుగు రాష్ట్రాల నుంచి జిల్లాకు మద్యం సరఫరాపె ౖప్రత్యేక నిఘా ఉంచామని, ఇప్పటికే పలువురిని అరెస్టు చేశామని సెబ్‌ ఏఈఎస్‌ కృష్ణకిశోర్‌రెడ్డి తెలిపారు.

పొరుగా రాష్ట్రాల మద్యంపై నిఘా
విలేకరులతో మాట్లాడుతున్న కృష్ణకిశోర్‌రెడ్డి

ఉదయగిరి రూరల్‌, నవంబరు 28: పొరుగు రాష్ట్రాల నుంచి జిల్లాకు మద్యం సరఫరాపె ౖప్రత్యేక నిఘా ఉంచామని, ఇప్పటికే పలువురిని అరెస్టు చేశామని సెబ్‌ ఏఈఎస్‌ కృష్ణకిశోర్‌రెడ్డి తెలిపారు. వివిధ మద్యం కేసుల్లో పట్టుబడిన ద్విచక్ర వాహనాలకు సోమవారం స్థానిక సెబ్‌ కార్యాలయంలో నిర్వహించిన వేలం పాటల్లో ఆయన పాల్గొన్నారు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ గంజాయి, గుట్కాల విక్రయాలపై నిఘా ముమ్మరం చేశామన్నారు. చట్టవ్యతిరేక కార్యక్రమాలు, గ్రామాల్లో అనధికార మద్యం విక్రయాలపై 14500 టోల్‌ప్రీ నెంబర్‌కు సమాచారం ఇవ్వాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జి సీఐ రవీంద్ర, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-28T22:55:11+05:30 IST