వైసీపీ పాలనలో సర్వేపల్లిలో అభివృద్ధి శూన్యం

ABN , First Publish Date - 2022-02-14T04:42:35+05:30 IST

వైసీపీ ప్రభుత్వ హయాంలో సర్వేపల్లి నియోజక వర్గంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, అంతా శూన్యమంటూ నియోజక వర్గ జనసేన నాయకుడు బొబ్బేపల్లి సురేష్‌ బాబు విమర్శించారు.

వైసీపీ పాలనలో సర్వేపల్లిలో అభివృద్ధి శూన్యం
శ్మశాన వాటికను పరిశీలిస్తున్న జనసేన నాయకులు

 నియోజక వర్గ జనసేన నాయకుడు బొబ్బేపల్లి  


వెంకటాచలం, ఫిబ్రవరి 13 : వైసీపీ ప్రభుత్వ హయాంలో సర్వేపల్లి నియోజక వర్గంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, అంతా శూన్యమంటూ నియోజక వర్గ జనసేన నాయకుడు బొబ్బేపల్లి సురేష్‌ బాబు విమర్శించారు. మండలంలోని సర్వేపల్లి గ్రామంలో ఆదివారం జనసేన నాయకులతో కలిసి  స్థానికంగా ఉన్న శ్మశాన వాటికను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్మశాన వాటిక అస్తవ్యస్తంగా తయారయిందని, దీనిపై గత కొద్ది నెలల నుంచి జనసేన ఆధ్వర్యంలో అనేకసార్లు కలెక్టరేట్‌లో జరిగే స్పందనలో ఆర్జీలు ఇచ్చినా   ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. అలాగే ఎంపీడీవోకు గ్రామస్థులు మొర పెట్టుకున్న పట్టించుకోలేదన్నారు. సర్వేపల్లి ఎమ్మెల్యే తానే అభివృద్ధి చేశానని గొప్పలు చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఈ క్రమంలో అధికార పార్టీ నేతలపై ఘాటుగా విమర్శలు చేశారు. శ్మశాన వాటికను సత్వరమే బాగు చేయాలని, లేనిపక్షంలో జనసేన ఆధ్వర్యంలో తామే బాగు చేసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో పినిశెట్టి మల్లికార్జున్‌, ఆస్తోటి రవికుమార్‌, సందీప్‌, వంశీ, సాయి, శ్రీహరి, గిరీష్‌, శ్రీను తదితరులున్నారు. 


Updated Date - 2022-02-14T04:42:35+05:30 IST