గాంధీ ఆశ్రమంలో సర్వమత ప్రార్థనలు

ABN , First Publish Date - 2022-02-21T03:18:50+05:30 IST

పల్లిపాడు పినాకిని స త్యాగ్రహ గాంధీ ఆశ్రమంలో ఆదివారం కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ సర్వమత ప్రార్థనలు జరిగాయి. ముందుగా పీవీ. శేషయ్య, స్కూల్‌

గాంధీ ఆశ్రమంలో సర్వమత ప్రార్థనలు
గాంధీ ఆశ్రమంలో ప్రార్థనలు

ఇందుకూరుపేట, ఫిబ్రవరి 20 : పల్లిపాడు పినాకిని స త్యాగ్రహ గాంధీ ఆశ్రమంలో ఆదివారం కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ సర్వమత ప్రార్థనలు జరిగాయి. ముందుగా పీవీ. శేషయ్య, స్కూల్‌ విద్యార్థులు మహాత్మాగాంధీ, పొనకా కనకమ్మ విగ్రహాలకు నూలుమాలలు, ఖాదీ వస్త్రాలు సమర్పించారు. అనంతరం కోర్‌ కమిటీ సభ్యురాలు గంపల మంజుల గాంధీ సూక్తుల గురించి విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో పల్లిపాడు సర్పంచు రెడ్డిపోగు సుధాకర్‌, ఆశ్రమ మేనేజర్‌ సాయిమనోజ్‌, తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-02-21T03:18:50+05:30 IST