కార్మిక సంఘాలతో కలసి సంఘటిత పోరాటం

ABN , First Publish Date - 2022-03-06T03:46:17+05:30 IST

నేలటూరులోని జెన్‌కో థర్మల్‌ కేంద్రం పైవేటీకరణకు వ్యతిరేకంగా అన్ని కార్మిక సంఘాలతో కలసి సంఘటిత పోరాటం చేస్తామని

కార్మిక సంఘాలతో కలసి సంఘటిత పోరాటం
జెన్‌కో ఉద్యోగులు, కార్మికుల ర్యాలీ

ముత్తుకూరు, మార్చి5:  నేలటూరులోని జెన్‌కో  థర్మల్‌ కేంద్రం పైవేటీకరణకు వ్యతిరేకంగా అన్ని కార్మిక సంఘాలతో కలసి సంఘటిత పోరాటం చేస్తామని ఏపీ విద్యుత్‌ ఉద్యోగుల జేఏసీ నాయకులు గుమ్మడి శ్రీనివాసులు పేర్కొన్నారు. శనివారం అన్ని కార్మిక సంఘాల నాయకులతో కలసి ఉద్యోగులు, కార్మికులు థర్మల్‌ కేంద్రం వద్ద ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఉద్యమంలో ఇప్పటి వరకు కొన్ని సంఘాలు మాత్రమే పాల్గొన్నాయని, అయితే అన్ని సంఘాల నాయకులతో చర్చించి, ఈ సమస్యపై ఏకతాటిపై నిలిచి పోరాడాలని కోరామన్నారు.  కార్యక్రమంలో నాయకులు కృష్ణచైతన్య, సుధాకర్‌, రాజేష్‌, అనంత్‌, నందకుమార్‌, గాలి అంకయ్య, నాగరాజు పాల్గొన్నారు. 


Read more