సమస్యలు పరిష్కరించాలంటూ ఆందోళన

ABN , First Publish Date - 2022-09-27T03:07:26+05:30 IST

తమ గ్రామంలోని సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సోమవారం టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్‌యాదవ్‌ ఆధ్వ

సమస్యలు పరిష్కరించాలంటూ ఆందోళన
ఆందోళన చేస్తున్న కనియంపాడు గ్రామస్థులు

వరికుంటపాడు, సెప్టెంబరు 26: తమ గ్రామంలోని సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సోమవారం టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్‌యాదవ్‌ ఆధ్వర్యంలో కనియంపాడు గ్రామస్థులు మండల పరిషత్‌ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలోని తాగునీటి పథకాలు మరమ్మతులకు గురై నెల రోజులుగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నా పట్టించుకొనే నాథుడే కరువయ్యారన్నారు. అలాగే పొలాలు, శ్మశానాలకు వెళ్లే రహదారులు కంపచెట్లతో కమ్ముకుపోయాయన్నారు. కనీసం ఉపాధి హామీ పనులు కల్పించడంలో కూడా అధికారులు విఫలమయ్యారన్నారు.  ఇప్పటికైనా సమస్యలను పరిష్కరిం చకపోతే ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం కార్యాలయం ఎదుట బైఠాయించి అధికారుల తీరును నిరసిస్తూ నినాదాలతో హోరెత్తించారు. ఎంపీడీవో విజయభాస్కర్‌రావుకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల కన్వీనర్‌ చండ్ర మధుసూదన్‌రావు, నాయకులు తాతిపూడి లాబాన్‌, పోకా మహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. 


Read more