సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యేకి వేడుకోలు

ABN , First Publish Date - 2022-11-10T23:19:00+05:30 IST

మండలంలోని కొరిమెర్లలో రెండవ రోజు గురువారం జరిగిన గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో సమస్యలు పరిష్కరించాలని గ్రామస్థులు ఎమ్మెల్యే విక్రమ్‌రెడ్డిని కోరారు.

సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యేకి వేడుకోలు
ఎమ్మెల్యే విక్రమ్‌రెడ్డికి సమస్యలు వివరిస్తున్న గ్రామస్థులు

సంగం, నవంబరు 10: మండలంలోని కొరిమెర్లలో రెండవ రోజు గురువారం జరిగిన గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో సమస్యలు పరిష్కరించాలని గ్రామస్థులు ఎమ్మెల్యే విక్రమ్‌రెడ్డిని కోరారు. మొదట తలుపూరుపాడులో ఎంపీ నిధులతో నిర్మించిన మినీ వాటర్‌ ప్లాంట్‌ను ప్రారంభించారు. అనంతరం కొరిమెర్ల బీసీ కాలనీలో గడప గడపకు కార్యక్రమం నిర్వహిస్తుండగా.. పక్కా గృహాలు, డ్రైనేజీలు లేక ఇబ్బందులు పడుతున్నామని విన్నవించారు. అనంతరం రామాలయం కూడలిలో గడపగడపకు వలంటీర్లు నిర్వహించిన సర్వేలో గుర్తించిన రేషన్‌ కార్డులు, సాదా బైనామా సమస్యలను గ్రామసభ దృష్టికి రాగా అధికారులతో చర్చించారు. కార్యక్రమంలో ఎంపీడీవో గోపి, తహసీల్దారు జయవర్థన్‌, అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, వైసీపీ నాయకులు రఘునాథ్‌రెడ్డి, కరీముల్లా, బాలనాయుడు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-10T23:19:03+05:30 IST