సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి : ఎమ్మెల్యే

ABN , First Publish Date - 2022-09-27T03:03:00+05:30 IST

మండలంలోని గ్రామాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టిసారించినట్లు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డి తెలిపారు. సో

సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి : ఎమ్మెల్యే
అనంతసాగరంలో పర్యటిస్తున్న ఎమ్మెల్యే

అనంతసాగరం, సెప్టెంబరు 26: మండలంలోని గ్రామాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టిసారించినట్లు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డి తెలిపారు. సోమవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన స్పందనలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా విలేజీ పార్కులో నిర్మించనున్న పంచాయతీరాజ్‌ అతిథి భవన నిర్మాణ పనులను ఆయన ప్రారంభించారు. అనంతరం సచివాలయాల వారీగా సమీక్ష నిర్వహించారు. అభివృద్ధి పనుల నివేదికలను పరిశీలించారు. మహిళలకు చేయూత చెక్కులను అందించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ రాపూరు వెంకటసుబ్బారెడ్డి, ఎంపీపీ సంపూర్ణమ్మ, ఎంపీడీవో మధుసూదన్‌రావు,  సర్పంచు మహబూబ్‌బాష తదితరులు పాల్గొన్నారు.


Read more