సమస్యల పరిష్కారానికే గడప గడపకు...

ABN , First Publish Date - 2022-10-18T03:24:36+05:30 IST

ప్రతి ఒక్కరి సమస్యలను తెలుసుకుని పరిష్కారించడానికే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమమని ఎమ్మెల్యే మేకపాటి విక్ర

సమస్యల పరిష్కారానికే గడప గడపకు...
ప్రజల నుంచి సమస్యలు తెలుసుకుంటున్న ఎమ్మెల్యే విక్రమ్‌రెడ్డి

ఏఎస్‌పేట,అక్టోబరు17: ప్రతి ఒక్కరి సమస్యలను తెలుసుకుని పరిష్కారించడానికే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమమని ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డి తెలిపారు.సోమవారం ఆయన గుంపర్లపాడులో నిర్వహించిన గడప గడపకు.. కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంటింటికి తిరిగి ప్రజాసమస్యలు తెలుసుకున్నారు. సచివాలయ సిబ్బంది,వలంటీర్ల పనీతీరు గురించి కూడా తెలుసుకున్నారు. కొత్తరోడ్డును, నీటి శుద్ధి కేంద్రాన్ని ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యురాలు పందిళ్లపల్లి రాజేశ్వరమ్మ, మండల కో ఆప్షన్‌ సభ్యుడు సయ్యద్‌ సందాని తదితరులు పాల్గొన్నారు.


---------



Updated Date - 2022-10-18T03:24:36+05:30 IST