విధులకు పీజీపట్నం సచివాలయం ఉద్యోగుల డుమ్మా

ABN , First Publish Date - 2022-12-06T23:15:58+05:30 IST

మండలంలోని ప్రభగిరిపట్నం గ్రామ సచివాలయ ఉద్యోగులు మంగళవారం విధులకు డుమ్మాకొట్టారు. మధ్యాహ్నం 12గంటలు దాటినా కార్యాలయంలో కనిపించలేదు.

విధులకు పీజీపట్నం సచివాలయం ఉద్యోగుల డుమ్మా
ఖాళీ కుర్చీలతో దర్శనమిస్తున్న సచివాలయం

5పీడీకేఆర్‌ 6 :

పొదలకూరు, డిసెంబరు 6 : మండలంలోని ప్రభగిరిపట్నం గ్రామ సచివాలయ ఉద్యోగులు మంగళవారం విధులకు డుమ్మాకొట్టారు. మధ్యాహ్నం 12గంటలు దాటినా కార్యాలయంలో కనిపించలేదు. కార్యాలయం మాత్రం తెరచి ఉంచారు. ఉద్యోగులు లేకపోవడంతో ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి. గ్రామ సచివాలయానికి రోజూ ఎంతో మంది రైతులు, ప్రజలు వారి సమస్యలు, వివిధ పనులపై వస్తుంటారు. అలాగే వచ్చిన వారు ఉద్యోగులు అందుబాటులో లేకపోవడంతో తమ సమస్యలను పట్టించుకునేది ఎవరని వారు ప్రశ్నించారు. క్రమశిక్షణ పాటించని ఉద్యోగులపై ఉన్నతాధికారులు చర్యలు చేపట్టాలని గ్రామస్థులు డిమాండ్‌ చేశారు. కొందరు అధికారులు బయోమెట్రిక్‌ వేసి వెళ్లిపోతున్నారని సమాచారం. తెలివైన కొందరు ఉద్యోగులు తాము ఫీల్డుపై ఉన్నామని చెప్పి అటు నుంచి అటే చల్లగా ఇళ్లకు జారుకుంటున్నారని పలువురు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ప్రభగిరిపట్నం సచివాలయంలో అధికారులు, ఉద్యోగుల సమయపాలనపై విచారణ జరిపి వారిపై చర్యలు తీసుకుని ప్రజలకు అందుబాటులో ఉండేలా చూడాలని గ్రామస్థులు కోరుతున్నారు.

Updated Date - 2022-12-06T23:15:59+05:30 IST