కోనలో ఆర్‌ఎస్‌ఎస్‌ శిక్షణ తరగతులు

ABN , First Publish Date - 2022-08-26T05:25:21+05:30 IST

పెంచలకోన క్షేత్రంలో రాష్ట్రస్థాయి ఆర్‌ఎస్‌ఎస్‌ విస్తారక్‌, ప్రచారక్‌లకు మూడురోజులుగా జరుగుతున్న శిక్షణ తరగతులు

కోనలో ఆర్‌ఎస్‌ఎస్‌ శిక్షణ తరగతులు

రాపూరు, ఆగస్టు 25: పెంచలకోన క్షేత్రంలో రాష్ట్రస్థాయి ఆర్‌ఎస్‌ఎస్‌ విస్తారక్‌, ప్రచారక్‌లకు మూడురోజులుగా జరుగుతున్న శిక్షణ తరగతులు గురువారం ముగిశాయి. ఇక్కడి పేరెన్ని కగన్న సత్రంలో మూడురోజుల పాటు సుమారు 200 మంది ఆర్‌ఎస్‌ఎస్‌ బాధ్యులు ఈ శిక్షణ లో పాల్గొన్నారు. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం శ్రీవారి ఆలయం ముందున్న ప్రాంగణంలో సాధన చేశారు. ఖాకీ నిక్కర్‌తో కర్రసాములు, విన్యాసాలు భక్తులను ఆకట్టుకున్నాయి.  

Read more