రోడ్లపై వర్షపు నీటితో ఇక్కట్లు

ABN , First Publish Date - 2022-07-27T03:16:05+05:30 IST

మండలంలోని వీఆర్‌ కోట గ్రామంలో రోడ్లపై నిలిచిన వర్షపు నీటితో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కురుస్తున్న వర్షాలకు గ్రామంలో

రోడ్లపై వర్షపు నీటితో ఇక్కట్లు
:రామాలయం వీధిలో రోడ్డుపై నిలిచిన వర్షపు నీరు

లింగసముద్రం, జూలై 26: మండలంలోని వీఆర్‌ కోట గ్రామంలో రోడ్లపై నిలిచిన వర్షపు నీటితో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కురుస్తున్న వర్షాలకు గ్రామంలోని పలు రహదారులపై నీరు నిలిచింది. దీంతో వాహనాలు, పాదచారుల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. రోడ్లపై నిలిచిన నీటిలో పందులు, దోమలు స్వైరవిహారం చేస్తుండడంతో వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీ అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు. 


Updated Date - 2022-07-27T03:16:05+05:30 IST