మూగజీవాలపై దూసుకెళ్లిన ట్రాక్టరు

ABN , First Publish Date - 2022-07-06T03:24:04+05:30 IST

మండలంలోని వెంకటరెడ్డిపల్లి వద్ద ఆత్మకూరు-సోమశిల ప్రధాన రహదారిపై అతివేగంగా వచ్చిన ట్రాక్టరు మూగజీవాలపై దుసుకెళింది.

మూగజీవాలపై దూసుకెళ్లిన ట్రాక్టరు
రోడ్డుపై చెల్లాచెదురుగా పడిన గొర్రెల కళేబరాలు

15 గొర్రెలు మృతి

అనంతసాగరం, జూలై 5: మండలంలోని వెంకటరెడ్డిపల్లి వద్ద ఆత్మకూరు-సోమశిల ప్రధాన రహదారిపై అతివేగంగా వచ్చిన ట్రాక్టరు మూగజీవాలపై దుసుకెళింది. ఈ ఘటనలో 15 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందగా మరికొన్ని గాయపడ్డాయి. ప్రమాదానికి కారణమై ట్రాక్టర్‌ సమీపంలోనే బోల్తాపడింది. స్థానికుల కథనం మేరకు.. రేవూరుకు చెందిన ట్రాక్టరు గ్రావెల్‌ లోడుతో వెళ్తూ మేతకు వెళుతున్న గొర్రెలపై దూచుకెళ్లింది. మృతి చెందిన గొర్రెల కళేబరాలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడ్డాయి. ఈ ఘటనతో బాధిత రైతు ఊడిబిండి వెంకటేశ్వర్లురెడ్డికి సుమారు రూ.3లక్షల నష్టం వాటిల్లింది. సమాచారం తెలుసుకొన్న అనంతసాగరం ఎస్‌ఐ మహబుబ్‌ సుబానీ సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.

Read more