రెవెన్యూ సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నాం : జేసీ

ABN , First Publish Date - 2022-09-18T03:51:19+05:30 IST

జిల్లాలో రెవెన్యూ సమస్యలను ఒకొక్కటిగా పరిష్కరిస్తున్నామని, త్వరలోనే అన్ని సమస్యలు తీరుతాయని జేసీ కూర్మనాథ్‌ అన్నారు. మండ

రెవెన్యూ సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నాం : జేసీ
చెర్లోపల్లి సచివాలయంలో తహసీల్దార్‌తో మాట్లాడుతున్న జేసీ కూర్మనాథ్‌

 మనుబోలు, నెల్లూరు జిల్లా: రెవెన్యూ సమస్యలను ఒకొక్కటిగా పరిష్కరిస్తున్నామని, త్వరలోనే అన్ని సమస్యలు తీరుతాయని జేసీ కూర్మనాథ్‌ అన్నారు. మండలంలోని చెర్లోపల్లి సచివాలయాన్ని శనివారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించి సిబ్బంది గురించి ఆరా  తీశారు. చాలా మంది సెలవుల్లో ఉంటే సచివాలయ సమస్యలు ఎవరు పరిష్కారిస్తారని మండిపడ్డారు. వచ్చేది వర్షాకాలమని, సీజనల్‌ వ్యాధులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఏఎన్‌ఎంకు సూచించారు.  వీఆర్‌వోలకు రెవెన్యూ గ్రామాల మార్పు ఉండదని జేసీ తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్‌ సుదీర్‌, ఈవోఆర్‌డీ రమణయ్య, సర్వేయర్‌ గోపికృష్ణ  తదితరులు పాల్గొన్నారు. 


Read more