ఆర్‌బీకేలతో రైతులకు అన్యాయం : టీఎన్‌ఎస్‌ఎఫ్‌

ABN , First Publish Date - 2022-05-20T03:00:43+05:30 IST

ఆర్‌బీకేలతో రైతులకు అన్యాయమేతప్ప ఎటువంటి లాభం జరగడంలేదని టీఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్రకార్యదర్శి చెరుకూరు నవీన్‌ అన్నా

ఆర్‌బీకేలతో రైతులకు అన్యాయం : టీఎన్‌ఎస్‌ఎఫ్‌
ధాన్యం రాశులవద్ద టీడీపీ నాయకులు


కొండాపురం. మే19: ఆర్‌బీకేలతో రైతులకు అన్యాయమేతప్ప ఎటువంటి లాభం జరగడంలేదని టీఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్రకార్యదర్శి చెరుకూరు నవీన్‌ అన్నారు. మండలంలోని కొమ్మి గ్రామంలో రైతులు పండించిన ధాన్యం రోజులు గడుస్తున్నా ఇప్పటివరకు కొనుగోలు చేయకపోవడం దారుణమన్నారు. స్థానిక టీడీపీ నాయకులతో కలసి గురువారం ధాన్యం రాశులను ఆయన పరిశీలించారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ధాన్యాన్ని కొనుగోలుచేసి రైతులను ఆదుకోవాలని ఆయన డిమాండుచేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు చెరుకూరు శేషయ్య, షేక్‌ ఖాసిం, బాదుల్లా, దేవినేని వెంకటసుబ్బయ్య, చీమల వెంగనారాయణ, ఆకుల మహేష్‌,   తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-05-20T03:00:43+05:30 IST