రాక్షస పాలనకు రోజులు దగ్గర పడ్డాయి

ABN , First Publish Date - 2022-05-31T03:15:06+05:30 IST

రాష్ట్రంలో సాగుతున్న రాక్షస పాలనకు చరమగీతం పాడే రోజులు దగ్గర పడ్డాయని రాష్ట్ర తెలుగు యువత ప్రధాన కార్యదర్శి పోలంరెడ్డి దినే

రాక్షస పాలనకు రోజులు దగ్గర పడ్డాయి
వెంకటాచలం : కరపత్రాలు పంపిణీ చేస్తున్న రావూరి రాధాకృష్ణనాయుడు తదితరులు

కొడవలూరు మే 30: రాష్ట్రంలో సాగుతున్న రాక్షస పాలనకు చరమగీతం పాడే రోజులు దగ్గర పడ్డాయని రాష్ట్ర తెలుగు యువత ప్రధాన కార్యదర్శి పోలంరెడ్డి దినేష్‌రెడ్డి అన్నారు. మండలంలోని నార్తురాజుపాలెంలో సోమవారం టీడీపీ మండల అధ్యక్షుడు కోటంరెడ్డి అమరేంద్రరెడ్డి ఆధ్వర్యంలో బాదుడే బాదుడు కార్యక్రమాన్ని నిర్వహించారు.  టీడీపీ నాయకులు ఇంటింటీకి తిరిగి పెరిగిన ధరలపై కరపత్రాలు పంపిణీ చేశారు. అనంతరం దినేష్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రం అభివృద్ధి పథంలో నడవాలంటే ముఖ్యమంత్రిగా  చంద్రబాబు నాయుడు రావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు చెక్కా మదన్‌, కరకటి మల్లికార్జున, గరికపాటి రాజేంద్ర కుమార్‌, నాసిన ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.


 రాష్ట్రానికి శ్రీలంక పరిస్థితే...


వెంకటాచలం, మే 30 : జగన్మోహన్‌రెడ్డి చెత్త పాలనతో రానున్న రెండేళ్లలో రాష్ట్రంలో శ్రీలంకలో  నెలకొన్న పరిస్థితు లు రానున్నాయని తెలుగు రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు రావూరి రాధాకృష్ణమనాయుడు తెలిపారు. మండలంలోని నిడిగుంటపాళెంలో సోమవారం సాయంత్రం బాదుడే బాదుడు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి కరపత్రాలను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ  రాష్ట్రంలో నిరంకుశ పాలన పోవాలంటే టీడీపీకి ఓటు వేసి ఆదరించాలన్నారు. ీ కార్యక్రమంలో నాయకులు మావిళ్ళపల్లి శ్రీనివాసులు నాయుడు,  రావూరి పద్మనాభనాయుడు, చల్లా నాగార్జున్‌ రెడ్డి, వల్లూరు రమేష్‌నాయుడు, కందిమళ్ళ సతీష్‌నాయుడు, వలిపి మునుస్వామి తదితరులు పాల్గొన్నారు. 
Read more