జెన్‌కో ప్రైవేటీకరణపై మభ్యపెడుతున్న ప్రభుత్వం

ABN , First Publish Date - 2022-06-30T03:05:04+05:30 IST

జెన్‌కో థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం ప్రైవేటీకరణ విషయంలో ప్రభుత్వం తమను మభ్యపెడుతోందని జెన్‌కో కాంట్రాక్టు కార్మికుల ఐక్యవే

జెన్‌కో ప్రైవేటీకరణపై మభ్యపెడుతున్న ప్రభుత్వం
మోకాళ్లపై నిలబడి నిరసన తెలుపుతున్న జెన్‌కో మహిళా కార్మికులు

ముత్తుకూరు, జూన్‌29: జెన్‌కో థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం ప్రైవేటీకరణ విషయంలో ప్రభుత్వం తమను మభ్యపెడుతోందని జెన్‌కో కాంట్రాక్టు కార్మికుల ఐక్యవేదిక నాయకులు పేర్కొన్నారు. బుధవారం నేలటూరులోని  జెన్‌కో థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం వద్ద మహిళా కార్మికులు మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ వాస్తవాలను వక్రీకరించి, నష్టాలను సాకు చూపి థర్మల్‌ కేంద్రాన్ని ప్రైవేటురంగానికి అప్పజెప్పేందుకు కుట్ర చేస్తున్నారన్నారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యోగులు, కార్మికులు చేస్తున్న ఉద్యమానికి రాష్ట్రవ్యాప్తంగా ప్రజా, కార్మిక సంఘాల మద్దతు లభిస్తోందన్నారు. జెన్‌కో థర్మల్‌ కేంద్రాన్ని రక్షించుకునేందు కు అవసరమైతే విద్యుత్‌సౌధను ముట్టడించేందుకు సిద్ధమని వారు ప్రకటించారు. ఈ సందర్భంగా వారు ‘ ప్రైవేటు వద్దు.. జెన్‌కో ముద్దు... సేవ్‌ జెన్‌కో.. అంటూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో జెన్‌కో ఉద్యోగులు, కాంట్రాక్టు కార్మికులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-06-30T03:05:04+05:30 IST