ప్రసన్న వేంకటేశ్వరుడికి ప్రత్యేక పూజలు
ABN , First Publish Date - 2022-08-14T03:13:05+05:30 IST
బోగోలు మండలం కొండబిట్రగుంటలో వెలసి ఉన్న ప్రసన్న వేంకటేశ్వరస్వామికి శనివారం ప్రత్యేక పూజలు, అభిషేకాలు వైభవంగా జరి

బిట్రగుంట, ఆగస్టు 13: బోగోలు మండలం కొండబిట్రగుంటలో వెలసి ఉన్న ప్రసన్న వేంకటేశ్వరస్వామికి శనివారం ప్రత్యేక పూజలు, అభిషేకాలు వైభవంగా జరిగాయి. శ్రావణ మాసం రెండో శనివారం కావడంతో ఆలయ ప్రాంగణంలో నూతన వధువరులు, బంధుమిత్రులతో తిరునాళ్ల వాతావరణం నెలకొంది. సాయంత్రం శ్రీదేవీభూదేవి సమేత ప్రసన్న వేంకటేశ్వరుడికి ఊంజలసేవను వేదమంత్రాల మధ్య వైభవంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.