-
-
Home » Andhra Pradesh » Nellore » prakasam viyak pratibha-MRGS-AndhraPradesh
-
వీడియో గేమ్స్ రూపకల్పనలో ‘ప్రకాశం’ విద్యార్థుల ప్రతిభ
ABN , First Publish Date - 2022-09-18T03:41:57+05:30 IST
వీడియో గేమ్స్ రూపకల్పనలో ప్రకాశం ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు చూపిన ప్రతిభ అనూహ్యమని ఏపీఎస్‌ఎస్‌డీసీ డిజైనర్, శిక్షకు

కందుకూరు, సెప్టెంబరు 17: వీడియో గేమ్స్ రూపకల్పనలో ప్రకాశం ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు చూపిన ప్రతిభ అనూహ్యమని ఏపీఎస్‌ఎస్‌డీసీ డిజైనర్, శిక్షకురాలు రేవతీదేవి ప్రశంసించారు.కళాశాలలో వారం రోజులుగా ఏపీఎస్‌ఎస్‌డీసీ ఆధ్వర్యంలో ద్వితీయ సంవత్సరం బీటెక్ ఈఈఈ విద్యార్థులకు వీడియో గేమ్స్ రూపకల్పనపై శిక్షణ నిర్వహించారు. ముగింపు సందర్భంగా శనివారం ఆమె మాట్లాడుతూ వారం రోజుల్లోనే నమోదు చేసుకున్న 50 మంది విద్యార్థులు తలా ఒక నూతన గేమ్‌ను ఆవిష్కరించటం అద్భుతమన్నారు. కరస్పాండెంట్ కంచర్ల రామయ్య మాట్లాడుతూ సాఫ్ట్‌వేర్ ఉద్యోగం సంపాదించాలంటే కోడింగ్‌లతో కుస్తీ పట్టాలని, అలాంటి శ్రమ లేకుండా సంపాదించేమార్గం ఉన్న వీడియో గేమ్స్ రూపకల్పన ద్వారా తమ విద్యార్థులకు లక్షల్లో ఆర్జనకు దారి చూపించటం ఆనందదాయకమ న్నారు. కార్యక్రమంలో మీరావలి తదితరులు పాల్గొన్నారు.
------