-
-
Home » Andhra Pradesh » Nellore » pra samasyala parishkarame lashyam-MRGS-AndhraPradesh
-
ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం
ABN , First Publish Date - 2022-10-01T04:52:46+05:30 IST
సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రజాబాట కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నామని జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జ్ నలిశెట్టి శ్రీధర్ పేర్కొన్నారు.

జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జ్ నలిశెట్టి శ్రీధర్
ఆత్మకూరు, సెప్టెంబరు 30 : సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రజాబాట కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నామని జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జ్ నలిశెట్టి శ్రీధర్ పేర్కొన్నారు. ‘పవనన్న ప్రజాబాట’ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఆత్మకూరు మున్సిపాల్టీ పరిధిలోని జేఆర్‌పేటలో కొనసాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2024లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ ప్రభుత్వం ఏర్పాటవుతుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో ప్రజాప్రతినిధులు, అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో జనసేన నాయకులు సురేంద్ర, వంశీ, చంద్ర, సురేష్, అనిల్, నాగరాజు, భాను, కిరణ్, వేణు తదితరులు పాల్గొన్నారు.