మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం

ABN , First Publish Date - 2022-08-05T05:12:32+05:30 IST

మండలంలోని గుడ్లూరువారిపాళెంలో గురువారం మైలారి పెంచలయ్య మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం చేశారు.

మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం
మృతదేహాన్ని బయటకు తీయిస్తున్న పోలీసులు

మైలారి పెంచలయ్య మృతిపై విచారణ

వెంకటాచలం, ఆగస్టు 4 : మండలంలోని గుడ్లూరువారిపాళెంలో గురువారం మైలారి పెంచలయ్య మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం చేశారు. గత నెల 31 రాత్రి పెంచలయ్య మృతి చెందాడు. పెంచలయ్యది ఆత్మహత్య కాదని, హత్య అనే అనుమానాలు ఉన్నాయని మృతుడి తమ్ముడు మైలారి రవి బుధవారం సాయంత్రం వెంకటాచలం పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు  చేశాడు. దాంతో వెంకటాచలం సీఐ జగన్‌మోహన్‌ రావు ఆధ్వర్యంలో ఎస్‌ఐలు శివనాంచారయ్య, అయ్యప్ప గురువారం గుడ్లూరువారిపాళెం గ్రామానికి వెళ్లి పరిశీలించారు. కుటుంబ సభ్యులు, బంధువులు, చుట్టు పక్కల వారిని విచారణ చేశారు. అనంతరం ఈనెల ఒకటో తేదీన పూడ్చిపెట్టిన పెంచలయ్య మృతదేహాన్ని బయటకు తీయించి తహసీల్దారు నాగరాజు పర్యవేక్షణలో నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులచే పోస్టుమార్టం చేయించారు. సీఐ జగన్‌మోహన్‌రావు మాట్లాడుతూ పోస్టుమార్టం నివేదిక  వచ్చాక వాస్తవాలు తెలుస్తాయన్నారు.

Updated Date - 2022-08-05T05:12:32+05:30 IST