బోర్డు అనుమతి మేరకే నాట్లు వేయాలని

ABN , First Publish Date - 2022-10-08T03:56:09+05:30 IST

పొగాకు రైతులు బోర్డు అనుమతించిన విస్తీర్ణం మేరకే నాట్లు వేయాలని పొగాకు బోర్డు విస్తరణ మేనేజరు డీ దామోదర్‌ పేర్కొన్నారు.

బోర్డు అనుమతి మేరకే నాట్లు వేయాలని
రికార్డులు పరిశీలిస్తున్న పొగాకు బోర్డు విస్తరణ మేనేజరు దామోదర్‌

పొగాకు బోర్డు విస్తరణ మేనేజరు దామోదర్‌ 

 కందుకూరు, అక్టోబరు 7: పొగాకు రైతులు బోర్డు అనుమతించిన విస్తీర్ణం మేరకే నాట్లు వేయాలని పొగాకు బోర్డు విస్తరణ మేనేజరు డీ దామోదర్‌ పేర్కొన్నారు. శుక్రవారం కందుకూరు పొగాకు వేలం కేంద్రాన్ని సందర్శించిన ఆయన ఎరువుల సరఫరా ప్రక్రియను పరిశీలించారు. వీలైనంత త్వరగా ఎరువులు తీసుకుని వెళ్లాలని కోరారు. అదనులో నాట్లు వేసుకోవడం ద్వారా అధిక దిగుబడులు సాధించవచ్చన్నారు. బోర్డు అధికారులు, క్షేత్ర సిబ్బంది ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండాలని కోరారు. అనంతరం కందుకూరు ప్రాంతంలోని పలు గ్రామాల్లో పొగ నాట్లుకి సిద్ధం చేసిన భూములను, ఉప్పలపాడులో పొగ నారుమడులను ఆయన పరిశీలించారు. పొగనారుమడులలో పురుగుమందులు ఎక్కువగా వాడరాదని, ట్రే నర్సరీ విధానం అలవాటు చేసుకుంటే ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని సూచించారు. కార్యక్రమంలో వేలం నిర్వహణ అధికారి కె.రాజగోపాలరెడ్డి, బోర్డు సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-10-08T03:56:09+05:30 IST