పేలనున్న భూ బాంబ్!
ABN , First Publish Date - 2022-12-21T23:48:42+05:30 IST
ఆదాయం పెంచుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం భూ బాధుడుకు సిద్ధమైంది. వాస్తవంగా ఈ ఏడాది ఆగస్టులోనే ఈ పెంపు ఉంటుందని భావించినా వాయిదా పడుతూ జనవరికి తప్పనిసరిగా అమలు చేసేందుకు కసరత్తు జరుగుతోంది.
ఆగస్టు కాదని.. జనవరిలో అమలుకు సన్నాహాలు
జాతీయ, రహదారి వెంబడి భూముల వివరాలు సేకరిస్తున్న అధికారులు
ఆదాయం పెంచుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం భూ బాధుడుకు సిద్ధమైంది. వాస్తవంగా ఈ ఏడాది ఆగస్టులోనే ఈ పెంపు ఉంటుందని భావించినా వాయిదా పడుతూ జనవరికి తప్పనిసరిగా అమలు చేసేందుకు కసరత్తు జరుగుతోంది. ఇందులో భాగంగానే జాతీయ, రాష్ట్ర రహదారులను ఆనుకొని ఉన్న భూముల విలువను పెంచడానికి ప్రభుత్వం దిశానిర్దేశం చేసింది. సదరు భూముల సర్వే నెంబర్లు, నోటిఫైడ్ రహదారుల వెంబడి భూముల సర్వే నెంబర్లు, ఆ భూముల ప్రస్తుత మార్కెట్ విలువలతో సిద్ధంగా ఉండాలని జిల్లా రిజిసే్ట్రషన శాఖ అధికారులకు ఆదేశాలు అందాయి.
నెల్లూరు (హరనాథపురం), డిసెంబరు 21 : జిల్లా విభజన సాకుతో భూములు, స్థలాల మార్కెట్ విలువలను రిజిసే్ట్రషన-స్టాంపుల శాఖ పెంచేందుకు సిద్ధమైంది. ఏప్రిల్‌లోనే మార్కెట్ విలువల పెంపు నివేదికలు సిద్ధం అయ్యాయి. సాధారణంగా మార్కెట్ విలువల పెంపు ఐదు నుంచి 10 శాతం వరకే ఉండి, ఆగస్టు నుంచి అమలులోకి వచ్చేది. కానీ ఈ ఏడాది పెంపును ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమలులోకి తేవాలనుకొన్నారు. స్టాంపు డ్యూటీ ద్వారా ఖజానా నింపుకొనేందుకు ఇష్టానుసారంగా ఽధరల పెంపు నివేదిక తయారు చేసినట్లు సమాచారం. స్టాంపు డ్యూటీ మాట అటుంచితే కొందరు రిజిసే్ట్రషన శాఖ అధికారులు, రియల్టర్లకు అనుకూలంగా భూముల మార్కెట్ విలువలను పెంచి నివేదకలు తయారు చేశారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనివల్ల సామాన్యులకే నష్టం వాటిల్లుతుందని అంతా భావించారు. ప్రతిపాదనలపై అభ్యంతరాలను రిజిసే్ట్రషన శాఖ వెబ్‌సైట్‌లో, తహసీల్దారు కార్యాలయాల్లో ఉంచటంతో అభ్యంతరాలు రాలేదు. దీంతో పెంచిన విలువలకు యథాతథంగా ఆమోదం లభించింది. అయితే, పెంచిన విలువలు ఏప్రిల్ నుంచి అమలులోకి తేలేదు. ఆగస్టులో మార్కెట్ విలువల పెంపు సాధారణంగా ఉండటంతో ఈసారి పెంపు ఉండే అవకాశం ఉంది. అందుకు తగ్గట్లు కసరత్తు జరుగుతోంది.
విస్తారంగా జాతీయ, రాష్ట్ర రహదారులు
జిల్లాలో విస్తారంగా నాలుగు జాతీయ రహదారులు ఉన్నాయి. చెన్నై-కోల్‌కతా (ఎనహెచ-16), నెల్లూరు-బళ్లారి (ఎనఎహెచ-67), ఏర్పేడు-నకిరేకల్ (ఎనఎహెచ-565), కావలి-సీతారామపురం (ఎనఎహెచ-167బి/జీ) జాతీయ రహదాలు ఉన్నాయి. ఇవికాక 20 రాష్ట్ర రహదారులు ఉన్నాయి. వాటికి ఆనుకొని ఉన్న వ్యవసాయ భూముల రిజిసే్ట్రషన విలువలను పెంచడానికి కసరత్తు జరుగుతోంది. సర్వే నెంబర్ల ఆధారంగా ధరలు తక్కువగా ఉన్న ప్రాంతాలలో భారీస్థాయిలో పెంచడానికి సిద్ధమవుతున్నారు.
జనవరి నుంచి బాదుడు?
తొలుత ఆగస్టులో భూములు, స్థలాల విలువలను పెంచడానికి భూముల సర్వే నెంబర్లు, వాటి విలువలతో సిద్ధంగా ఉండాలనే జిల్లా అధికారులకు ఆదేశాలు రావటంతో నివేదికలు తయారు చేశారు. వాటితోపాటు జాతీయ, రాష్ట్ర రహదారుల వెంబడి భూముల వివరాలు కూడా ఇప్పటికే సిద్ధం చేశారు. జనవరి నుంచి ఆ విలువలకు కొన్ని సరవణలు చేసి అమలు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.
నెల్లూరులోని కొండాయపాళెంలో ఎకరా భూమి మార్కెట్ విలువ రూ.1.65కోట్లు ఉంది. దానిని రూ.2.25 కోట్లకు పైబడి పెంచడానికి అధికారులు నివేదిక తయారు చేసినట్లు సమాచారం.
కాకుటూరు, బుజుబుజ నెల్లూరు, కనుపూరు బిట్-1 తదితర చోట్ల భూముల మార్కెట్ విలువలను రూ. కోట్లలో పెంచడానికి నివేదిక సిద్ధం చేస్తున్నారు.
పొట్టేపాళెంలో ఎకరా భూమి మార్కెట్ విలువ రూ.72 లక్షలు ఉండగా, రూ. కోటికిపైగా పెరగనుంది.
మార్చి ఆఖరులో మార్కెట్ వ్యాల్యూ రివిజన కమిటీ ఆమోదించిన మార్కెట్ విలువలు
అల్లీపురంలో రూ.19లక్షలుగా ఉన్న ఎకరా భూమి మార్కెట్ విలువను రూ.20లక్షలుగా పెంచారు. గుండ్లపాళెంలో రూ.19 లక్షలుగా ఉన్న ఎకరా భూమి విలువను రూ. 20లక్షలకు పెరగనుంది.
కాకుపల్లిలో ఎకరా భూమి మార్కెట్ విలువను 15 లక్షల నుంచి రూ. 20లక్షలకు పెంచారు. బ్రహ్మదేవంలో రూ.13 లక్షలను రూ.17లక్షలకు పెంచనున్నారు.
కావలి సబ్‌రిజిసా్ట్రర్ కార్యాలయ పరిధిలోని చలంచర్లలో రూ.3లక్షలుగా ఉన్న ఎకరా భూమిని రూ. 3.30 లక్షలకు పెంచారు. సర్వాయపాళెంలో రూ.11లక్షలుగా ఉన్న ఎకరా భూమిని రూ.13లక్షలకు పెరగనుంది.
వివరాలు సేకరిస్తున్నాం
జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారుల వెంబడి సర్వే నంబర్లను సేకరించమని ఆదేశాలు వచ్చాయి. ఆ ప్రకారం భూముల వివరాలు, వాటి సర్వే నెంబర్ల వివరాలు సేకరిస్తున్నాం.
- బాలాంజనేయులు, జిల్లా రిజిసా్ట్రర్