పశువుల దాణా, మందుల దుకాణాల్లో తనిఖీలు
ABN , First Publish Date - 2022-02-08T05:27:05+05:30 IST
ఆంధ్రప్రదేశ్ పశుదాణా చట్టం అమలుపై జిల్లాలో సోమవారం పశువుల మందులు, మినరల్ మిక్చర్, దాణా తయారీ కేంద్రాలపై పశుసంవర్థకశాఖ, రెవెన్యూ, పోలీసు శాఖలు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించాయి.
39 షాపులకు నోటీసులు
నెల్లూరు, (వ్యవసాయం), ఫిబ్రవరి 7 : ఆంధ్రప్రదేశ్ పశుదాణా చట్టం అమలుపై జిల్లాలో సోమవారం పశువుల మందులు, మినరల్ మిక్చర్, దాణా తయారీ కేంద్రాలపై పశుసంవర్థకశాఖ, రెవెన్యూ, పోలీసు శాఖలు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించాయి. తయారీదారులు, పంపిణీదార్లు, రిటైలర్లు లైసెన్సులు పొంది ఉన్నారా.. లేదా అని పరిశీలించారు. నిర్దేశిత ఫీజు చెల్లించి లైసెన్సు పొందాలని పశుసంవర్థకశాఖ జాయింట్ డైరెక్టర్ మహేశ్వరుడు సూచించారు. జిల్లాలోని ప్రతి మండలంలో పోలీసు, రెవెన్యూ, పశుసంవర్థకశాఖలకు చెందిన వారిని ఒక బృందంగా ఏర్పాటు చేసి ఈ తనిఖీలు చేయించామని తెలిపారు. దాదాపు 99 షాపులను తనిఖీ చేయగా 39 షాపులకు నోటీసు లు అందించామన్నారు. లైసెన్సు లేకుండా వ్యాపార లావాదేవీలు జరిపితే రూ.5లక్షల జరిమానాతోపాటు దుకాణం జప్తు చేయడం జరుగుతుందని హెచ్చరించినట్లు జేడీ చెప్పారు.