పార్కు స్థలంలో చెత్త డంపింగ్‌

ABN , First Publish Date - 2022-05-31T03:09:41+05:30 IST

కావలి పట్టణంలోని మున్సిపల్‌ ప్లాట్స్‌లో ఉన్న మున్సిపల్‌ పార్కును చెత్తను డంపింగ్‌ యార్డుగా మార్చేందుకు మున్సిపల్‌ సిబ్బంది ఏర్పాట్లు చేస్తుండగా సోమవారం స్థానికులు అడ్డుకున్నారు.

పార్కు స్థలంలో చెత్త డంపింగ్‌
చెత్త డంపింగ్‌పై అభ్యంతరం వ్యక్తం చేస్తున్న స్థానికులు

అడ్డుకున్న స్థానికులు

కావలి, మే 30: కావలి పట్టణంలోని మున్సిపల్‌ ప్లాట్స్‌లో ఉన్న మున్సిపల్‌ పార్కును చెత్తను డంపింగ్‌ యార్డుగా మార్చేందుకు మున్సిపల్‌ సిబ్బంది ఏర్పాట్లు చేస్తుండగా సోమవారం స్థానికులు అడ్డుకున్నారు. ఇళ్ల మధ్య ఆహ్లాదం కోసం వదిలిన పార్కు స్థలంలో పార్కు ఏర్పాటు చేయకుండా డంపింగ్‌ యార్డు ఏమిటని ప్రశ్నించారు. ఇళ్ల నుంచి మున్సిపల్‌ కార్మికులు సేకరించిన చెత్తను ఆ పార్కు స్థలంలో డంప్‌ చేసి అక్కడ తడి, పొడి చెత్తను వేరు చేసి పొడి చెత్తను వ్యాపార సంస్థలకు, తడి చెత్తను మరో డంపింగ్‌ యార్డుకు తరలించే ఉద్దేశ్యంతో అక్కడ పార్కులో ఉన్న చెట్లను మున్సిపల్‌ కార్మికులు తొలగిస్తున్నారు. ఆ విషయం తెలుసుకున్న స్థానికులు ఇక్కడ చెత్తను డంపింగ్‌ చేస్తే దుర్వాసన వెదజల్లుతూ డంపింగ్‌ యార్డుగా తయారవుతోందన్నారు. అసలు ఇళ్ల మధ్య చెత్త డంపింగ్‌ ఏమిటని, దీనిని అడ్డుకునేందుకు ఎంతటి పోరాటానికైనా సిద్ధమని హెచ్చరించారు. దీంతో మున్సిపల్‌ సిబ్బంది అక్కడ నుంచి వెను దిరిగి పోయారు.

Read more