పంటలకు నష్టపరిహారం చెల్లించాలి

ABN , First Publish Date - 2022-12-13T00:35:46+05:30 IST

తుఫాను కారణంగా దెబ్బతిన్న పంటలకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని ఏపీ రైతు సంఘం, అఖిలపక్ష రైతు సంఘాలు డిమాండ్‌ చేశాయి.

పంటలకు నష్టపరిహారం చెల్లించాలి
కలెక్టరేట్‌ వద్ద ధర్నా చేపడుతున్నా సీపీఐ, రైతు సంఘాలు

నెల్లూరు (వైద్యం) డిసెంబరు 12 : తుఫాను కారణంగా దెబ్బతిన్న పంటలకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని ఏపీ రైతు సంఘం, అఖిలపక్ష రైతు సంఘాలు డిమాండ్‌ చేశాయి. సోమవారం కలెక్టరేట్‌ వద్ద సీపీఐతో కలిసి రైతు సంఘాల నేతలు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా అఖిలపక్ష రైతు సంఘం జిల్లా కన్వీనర్‌ గంగపట్నం రమణయ్య మాట్లాడుతూ పారుదల కాలువలలో సరిగ్గా పూడిక తీయక పోవటంతో ఈ వర్షాలకు నారుమళ్లు పూర్తిగా మునిగి పోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. సీపీఐ జిల్లా కార్యదర్శి దామా అంకయ్య మాట్లాడుతూ దెబ్బతిన్న నారుమళ్లకు ఉచితంగా విత్తనాలు అందచేయాలని డిమాండ్‌ చేశారు. ఇప్పటికే నారు పోసుకుని నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని కోరారు. పారుదల కాలువలకు వెంటనే మరమ్మతు చేయాలని, బలహానంగా ఉన్న చెరువులను గుర్తించి పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం జేసీ కూర్మనాథ్‌కు వినతిపత్రం అందించారు. ఈ నిరసనలో ఏపీ రైతు సంఘం జిల్లా కన్వీనర్‌ షాన్‌వాజ్‌, సీపీఐ నేతలు రామరాజు, సిరాజ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-13T00:35:48+05:30 IST