పంచాయతీ నోటీసు బోర్డు యథాతథం

ABN , First Publish Date - 2022-07-08T04:10:34+05:30 IST

పట్టణానికి చెందిన కన్నా సుధాకర్‌ 1985లో సత్యనారాయణ ట్రేడర్స్‌ లేఅవుట్‌లో ప్రజాప్రయోజనాల కోసం కేటాయించిన 286 అంకణాల స్థలంలో గాలికి పడిపోయిన పంచాయతీ హెచ్చరిక బోర్డును గురువారం యథాతథంగా నాటారు.

పంచాయతీ నోటీసు బోర్డు యథాతథం
యథాతథంగా బోర్డు నాటుతున్న అధికారులు

పంచాయతీ నోటీసు బోర్డు యథాతథం

పొదలకూరు, జూలై 7 : పట్టణానికి చెందిన కన్నా సుధాకర్‌ 1985లో సత్యనారాయణ ట్రేడర్స్‌ లేఅవుట్‌లో ప్రజాప్రయోజనాల కోసం కేటాయించిన 286 అంకణాల స్థలంలో గాలికి పడిపోయిన పంచాయతీ హెచ్చరిక బోర్డును గురువారం యథాతథంగా నాటారు. పంచాయతీ సెక్రటరీ అల్లాబక్షు తిరిగి నాటించారు. 2019లో ఆ లే అవుట్‌తో సంబంధం ఉన్న ఓ వ్యక్తి ఆ స్థలాన్ని ప్లాట్లుగా వేసి అమ్మకానికి పెట్టాడు. ప్రజాప్రయోజనాల కోసం ఏర్పాటు చేసిన స్థలాన్ని అప్పట్లో తహసీల్దారు, సర్వేయర్‌, వీఆర్వో, పంచాయతీ సిబ్బంది ఆ లే అవుట్‌ను పరిశీలించి పంచాయతీ స్థలంగా నిర్ధారించారు. అనంతరం పంచాయతీ అధికారులు హెచ్చరిక బోర్డు కూడా  ఏర్పాటు చేశారు. బుధవారం రాత్రి వీచిన గాలికో లేక ఎవరో రాత్రి వేళలో ఆ హెచ్చరిక బోర్డును కింద పడేశారు. దాంతో వారు తిరిగి ఆ హెచ్చరిక నోటీసు బోర్డును నాటించారు.  కోర్టులో ఉన్న ఈ వివాద  స్థలంలోకి ఎవరూ ప్రవేశించకూడదని తెలిపారు.

Read more