విద్యుదాఘాతంతో ఒకరి మృతి
ABN , First Publish Date - 2022-12-15T23:24:17+05:30 IST
మండలంలోని అనంతపురం గ్రామ ఎస్సీ కాలనీలో గురువారం ఒక వ్యక్తి విద్యుదాఘాతంతో మృతిచెందాడు.
కలిగిరి, డిసెంబరు 15: మండలంలోని అనంతపురం గ్రామ ఎస్సీ కాలనీలో గురువారం ఒక వ్యక్తి విద్యుదాఘాతంతో మృతిచెందాడు. వివరాల మేరకు కాలనీ సమీపంలో పోలేరమ్మ ఆలయంలో చెన్నయ్య (6) పూజలు చేస్తూ ఆలయ నిర్వహణ చూసుకుంటున్నాడు. సమీపంలో బోరు మోటారు పనిచేయకపోవడంతో విద్యుత్ సరఫరా ఆపకుండా తీగల జాయింట్లు సరిచేస్తుండగా షాక్ కొట్టి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య కుమారుడు, కుమార్తె ఉన్నారు. చెన్నయ్య మృతితో కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి.