రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

ABN , First Publish Date - 2022-06-08T04:57:05+05:30 IST

కృష్ణపట్నం నుంచి నెల్లూరు వెళ్తున్న వాహనం ఢీ కొనడంతో వ్యక్తి మృతి చెందిన సంఘటన మల్లూరు సమీపంలో ప్రధాన రహదారిపై మంగళవారం జరిగింది.

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
ప్రమాదంలో మృతి చెందిన శేషయ్య

ముత్తుకూరు, జూన్‌7: కృష్ణపట్నం నుంచి నెల్లూరు వెళ్తున్న వాహనం ఢీ కొనడంతో వ్యక్తి మృతి చెందిన సంఘటన మల్లూరు సమీపంలో ప్రధాన రహదారిపై మంగళవారం  జరిగింది. పోలీసుల కథనం మేరకు పెనుబర్తికి చెందిన కమతం శేషయ్య (35) వాటర్‌ క్యాన్‌లు తీసుకెళ్లే ట్రక్కులో వస్తున్నాడు. కృష్ణపట్నం నుంచి వెళ్తున్న ఓ వాహనం ట్రక్కును ఢీ కొట్టింది. శేషయ్య రోడ్డుపై పడి తలకు తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ముత్తుకూరు ఎస్‌ఐ శివకృష్ణారెడ్డి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. శేషయ్య మృతదేహాన్ని నెల్లూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించి, కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

Read more