-
-
Home » Andhra Pradesh » Nellore » one person died in penna river-MRGS-AndhraPradesh
-
పెన్నానదిలో ప్రమాదశాత్తూ యువకుడి మృతి
ABN , First Publish Date - 2022-09-14T05:04:04+05:30 IST
మండలంలోని అప్పారావుపాళెం వద్ద పెన్నానదిలోకి ఈతకెళ్లిన ఓ యువకుడు ప్రమాదవశాత్తూ మృతిచె ందాడు.

ఆత్మకూరు, సెప్టెంబరు 13 : మండలంలోని అప్పారావుపాళెం వద్ద పెన్నానదిలోకి ఈతకెళ్లిన ఓ యువకుడు ప్రమాదవశాత్తూ మృతిచె ందాడు. ఈ విషాద ఘటన మంగళవారం జరిగింది. పోలీసుల కథనం మేరకు ఆత్మకూరు మున్సిపాల్టీ పరిధిలోని పేరారెడ్డిపల్లి బీసీ కాలనీకి చెందిన అన్నం లోకేష్(18), కోటకొండ వెంకటరమణ, బాషం బాలాజీ మంగళవారం మధ్యాహ్నం కాశీనాయన ఆశ్రమంలో భోజనం చేశారు. అనంతరం పెన్నానది వద్దకు ఈతకు వెళ్లారు. సోమశిల జలాశయం గేట్లు ఎత్తి వరదనీటిని విడుదల చేస్తుండడంతో పెన్నానదిలో వరద ప్రవాహం వేగంగా ఉంది. అన్నం లోకేష్ లోతు ఎంతుందోనని నది ఒడ్డు నుంచి నీటిలో అడుగు పెట్టాడు. వరద ఉధృతికి కాళ్ల కింద ఇసుక జారడంతో నదిలో కొట్టుకుపోయి సుడిగుండంలో ఇరుక్కుపోయాడు. అతడిని కాపాడాలని ఇద్దరు మిత్రులు ప్రయత్నించినా లాభం లేకపోయింది. సమాచారం అదు కున్న పోలీసులు, అగ్నిమాపకదళ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టి లోకేష్ మృతదేహాన్ని బయటకు తీశారు. కుటుంబ సభ్యులు, బంధువులు అక్కడకు చేరుకుని బోరున విలపించారు. మృతుడు ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువు తున్నాడు. సంఘటనా స్థలాన్ని డీఎస్పీ వెంకటేశ్వరరావు, ఎస్‌ఐ సాయిపస్రాద్ పరిశీలించారు.