చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

ABN , First Publish Date - 2022-09-11T05:17:56+05:30 IST

జీజిహెచ్‌లో చికిత్స పొందుతూ గుర్తుతెలియని వ్యక్తి శనివారం మృతి చెందాడు.

చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

నెల్లూరు(క్రైం): సెప్టెంబరు 10: జీజిహెచ్‌లో చికిత్స పొందుతూ గుర్తుతెలియని వ్యక్తి శనివారం మృతి చెందాడు. పోలీసుల సమాచారం మేరకు గుర్తుతెలియని (42) వ్యక్తి శుక్రవారం రాత్రి కెఎల్‌ఎం షాపింగ్‌మాల్‌ సమీపంలో అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని గుర్తించిన స్థానికులు 108కు సమాచారం అందించారు. 108 సిబ్బంది ఆ వ్యక్తిని చికిత్స నిమిత్తం జీజిహెచ్‌లో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు. చిన్నబజారు ఎస్‌ఐ ఎస్‌కె ఎండీ హనీఫ్‌ వైద్యశాలకు చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని మార్చుకీకు తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Read more