మలిదేవి వాగులో పడి ఒకరి మృతి

ABN , First Publish Date - 2022-12-16T22:59:47+05:30 IST

మండలంలోని వేగూరు గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ప్రమాదవశాత్తూ గురువారం వేకువన మలిదేవి వాగులో పడి మృతి చెందాడు.

మలిదేవి వాగులో పడి ఒకరి మృతి

కోవూరు, డిసెంబరు16: మండలంలోని వేగూరు గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ప్రమాదవశాత్తూ గురువారం వేకువన మలిదేవి వాగులో పడి మృతి చెందాడు. స్థానికుల కథనం ప్రకారం..వేగూరు గ్రామానికి చెందిన ముడి రఘు( 45) గేదెల కొనుగోలు అమ్మకం వ్యాపారం చేస్తుంటాడు. ఈ క్రమంలో గేదెల కొనుగోలు నిమిత్తం గురువారం వేకువున ఇంటి నుంచి మోటారుబైక్‌పై విడవలూరు బయలుదేరాడు. మోడేగుంట- పార్లపల్లి గ్రామాల మధ్య ఉధృత్రంగా ప్రవహిస్తున్న మలిదేవి వాగులో ప్రమాదవశాత్తూ పడి కొట్టుకుపోయాడు. విడవలూరుకు బయలుదేరిన రఘు ఎంతకీ ఇంటికి రాకపోయేసరికి కుటుంబ సభ్యులు శుక్రవారం గాలింపు చేపట్టారు. మలిదేవి వాగు బ్రిడ్జి కింద ఆయన మోటారుబైక్‌ను గుర్తించి మంచు ప్రభావం వల్ల ప్రమాదవశాత్తూ పడిపోయి ఉంటాడని భావించి మలిదేవి వాగులో వెతికారు. రఘు మృత దేహాన్ని మలిదేవి వాగులో సమముదివర్తి గ్రామ సమీపంలో కనుగొన్నారు. మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఎస్‌ఐ డి. వేంకటేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Updated Date - 2022-12-16T22:59:49+05:30 IST