పొగాకు నష్టాల పరిశీలనకు నాలుగు బృందాలు

ABN , First Publish Date - 2022-12-16T23:12:19+05:30 IST

మాండస్‌ తుఫాన్‌ ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు డీసీ పల్లి పొగాకు వేలం కేంద్రం పరిధిలో పొగాకు పంట నష్టాలను అంచనా వేసేందుకు నాలుగు బృందాలను నియమించారు.

పొగాకు నష్టాల పరిశీలనకు నాలుగు బృందాలు
డీసీ పల్లి పొగాకు పంటను పరిశీలిస్తున్న సీటీఆర్‌ఐ బృందం

మర్రిపాడు, డిసెంబరు 16 : మాండస్‌ తుఫాన్‌ ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు డీసీ పల్లి పొగాకు వేలం కేంద్రం పరిధిలో పొగాకు పంట నష్టాలను అంచనా వేసేందుకు నాలుగు బృందాలను నియమించారు. సీటీఆర్‌ఐతో కూడిన ఈ బృందాలు శుక్రవారం డీస పల్లి, గుండెమడగల, బైరవరం తదితర గ్రామాల్లో పర్యటించి రైతులకు తగిన సూచన సలహాలు ఇచ్చారు. అంతే కాకుండా పొలంలో నిలువ ఉండే నీటిని త్వరగా బయటకు పంపి తేమను తగ్గించే ప్రయత్నం చేయాలని సూచించారు. మొక్కులకు ఎటువంటి తెగులు సోకకుండా సిలింద్రియా నాసిని కోసైడ్‌, లేదా కార్బోయో టాప్‌ పిచికారీ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మేనేజరు జి.దామోదర్‌, వేలం సూపరింటెండెంట్‌ ఎం.శంకర్‌రావు, మార్కెటింగ్‌ సీటీఆర్‌ఐ శాస్త్రవేత్తలైన పూర్ణబిందు, కె.ప్రభాక్‌రావు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-16T23:12:20+05:30 IST