నిందితులను అరెస్టు చేయాలని జనసేన ధర్నా
ABN , First Publish Date - 2022-08-17T03:22:50+05:30 IST
ఏఎస్పేట మండలం పెద్దబ్బీపురంలో ఇమ్మిడిశెట్టి వెంగయ్య పొలంలో 98 మామిడి చెట్లను నరికివేసిన కేసులో నిందితులను వెంటనే అరెస్ట్

ఆత్మకూరు, ఆగస్టు 16: ఏఎస్పేట మండలం పెద్దబ్బీపురంలో ఇమ్మిడిశెట్టి వెంగయ్య పొలంలో 98 మామిడి చెట్లను నరికివేసిన కేసులో నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం జనసేన ఆధ్వర్యంలో ఆత్మకూరులో ధర్నా నిర్వహించారు. మానవహారంగా ఏర్పడి నిరసన తెలిపారు. దీంతో రోడ్డుకు ఇరువైపులా గంటసేపు ట్రాఫిక్ స్తంభించింది. పోలీసులు రంగప్రవేశం చేసి సర్ధిచెప్పేందుకు ప్రయత్నించారు. వారు ససేమిరా అనడంతో డీఎస్పీ వెంకటేశ్వరరావు స్పందించి ఫోన్లో జనసేన నాయకులతో మాట్లాడి నిందితులను అరెస్ట్ చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో వారు ధర్నా విరమించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి నలిశెట్టి శ్రీధర్ మాట్లాడుతూ బాధితులకు న్యాయం చేయకుంటే జనసేన ఆధ్వర్యంలో పోరాటం చేస్తామన్నారు.