కొత్త ఏడాది వేడుకలకు సిద్ధం

ABN , First Publish Date - 2022-12-31T23:35:46+05:30 IST

: మండలంలో ఆదివారం నూతన సంవత్సరానికి స్వాగతం పలకడానికిపలు ఆలయాలు ముస్తాబయ్యాయి. శనివారం విద్యార్థులు పాఠశాలల్లో కేకులు కట్‌ చేసుకొని ముందస్తు వేడుకలు నిర్వహించారు. బేకరీ

 కొత్త ఏడాది వేడుకలకు సిద్ధం
కలిగిరిలో బేకరీ షాపు వద్ద సందడి

కలిగిరి, డిసెంబరు 31: మండలంలో ఆదివారం నూతన సంవత్సరానికి స్వాగతం పలకడానికిపలు ఆలయాలు ముస్తాబయ్యాయి. శనివారం విద్యార్థులు పాఠశాలల్లో కేకులు కట్‌ చేసుకొని ముందస్తు వేడుకలు నిర్వహించారు. బేకరీ షాపుల వద్ద కేకుల కొనుగోలుదారులతో సందడి నెలకొంది.

బోగోలులో...

బిట్రగుంట : బోగోలు మండలంలో నూతన సంవత్సరానికి స్వాగతం పలికేందుకు ఆలయాలు,చర్చిలు శనివారం ముస్తాబయ్యాయి. బోగోలు, ఇబ్రహీంపేటలలో కేకుల కోసం మిఠాయి అంగళ్ల వద్ద జనం బారులు తీరారు. దుకానాలకు విద్యుత్‌దీపాలంకరణ చేశారు.

క్యాలెండర్‌ ఆవిష్కరణ

కందుకూరు : ఏపీఎన్‌జీవో అసోసియేషన్‌ కందుకూరు తాలూకా యూనిట్‌ నాయకులు శనివారం నూతన సంవత్సర క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. తహసిల్దార్‌ డి. సీతారామయ్య దీన్ని అవిష్కరించారు. కార్యక్రమంలో అసోసియేషన్‌ అధ్యక్ష, కార్యదర్శులు ప్రసాదరావు, సుబ్రహ్మణ్యం, నాయకులు సుజాత, రజిత, రాజేశ్వరి, బాలరాజు, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-31T23:35:47+05:30 IST