స్వాతంత్య్ర ఉద్యమంలో నేతాజీ పాత్ర ప్రత్యేకమైనది

ABN , First Publish Date - 2022-01-23T04:20:35+05:30 IST

స్వాతంత్య్ర ఉద్యమంలో నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ పాత్ర ప్రత్యేకమైనదని కృష్ణప ట్నం జెన్‌కో డీఎస్పీ కొల్లూరు శ్రీనివాసరావు

స్వాతంత్య్ర ఉద్యమంలో నేతాజీ పాత్ర ప్రత్యేకమైనది
మాట్లాడుతున్న శ్రీనివాసరావు


వెంకటాచలం, జనవరి 22 : స్వాతంత్య్ర ఉద్యమంలో నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ పాత్ర  ప్రత్యేకమైనదని కృష్ణప ట్నం జెన్‌కో డీఎస్పీ కొల్లూరు శ్రీనివాసరావు పేర్కొన్నారు. మండలంలోని కనుపూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నేతాజీ జయంతి  వేడుకలను శనివారం ఘనంగా నిర్వ హించారు. ముఖ్యఅతిధిగా విచ్చేసిన డీఎస్పీ నేతాజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళ్లర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నేతాజీ జీవిత విశేషాలు, విద్యార్థుల భద్రతకు సంబంధించిన విషయాలను తెలియజేశారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు కృష్ణారెడ్డి, ఉపాధ్యాయులు ఉమామహేష్‌, సురేఖ, చెరుకూ రి పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-01-23T04:20:35+05:30 IST