నేర రహిత సమాజ నిర్మాణానికి కృషి

ABN , First Publish Date - 2022-09-11T04:12:48+05:30 IST

నేర రహిత సమాజ నిర్మాణానికి అందరూ కృషి చేయాలని జిల్లా వ్యవసాయ సలహా మండలి అధ్యక్షుడు దొడ్డంరెడ్డి నిరంజ

నేర రహిత సమాజ నిర్మాణానికి కృషి
కోవూరు : మాట్లాడుతున్న డీఏఏబీ చైర్మన్‌ నిరంజన్‌బాబురెడ్డి

కోవూరు, సెప్టెంబరు 10 : నేర రహిత సమాజ నిర్మాణానికి అందరూ కృషి చేయాలని జిల్లా వ్యవసాయ సలహా మండలి అధ్యక్షుడు దొడ్డంరెడ్డి నిరంజనబాబు రెడ్డి కోరారు. కోవూరు పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన  సదస్సులో ఆయన మాట్లాడుతూ నేర రహిత సమాజమే ప్రతి పౌరుడి బాధ్యత కావాలన్నారు.  సీసీ కెమెరాల ఏర్పాటుకు ఆయన రూ.లక్ష విరాళం ప్రకటించారు. వేగూరు క్యాటరింగ్‌ అధినేత తుమ్మలపెంట చంద్ర  కూడా రూ.లక్ష విరాళం ప్రకటించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ కే శ్రీలత, జలజీవన్‌ మిషన్‌ చైర్మన్‌ జీ భాస్కర్‌రెడ్డి, సీఐ రామకృష్ణారెడ్డి, ఎస్‌ఐ వెంకటేశ్వరరావు, కొడవలూరు ఎస్‌ఐ సుబ్బారావు, ఎంపీటీసీలు, సర్పంచిలు తదితరులు పాల్గొన్నారు. 

ముత్తుకూరు : గ్రామాల్లోని కూడళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించాలని ఎస్‌ఐ శివకృష్ణారెడ్డి కోరారు. శనివారం మండల పరిషత్‌ కార్యాలయంలో ఆయన సర్పంచులు, ఉప సర్పంచిలు, కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  పారిశ్రామిక  ప్రాంతమైన ముత్తుకూరు మండలంలోని గ్రామాల్లో ఇతరరాష్ట్రాల వారు అధికంగా నివసిస్తున్నారన్నారు. అందుకనే నేర నియంత్రణ కోసం తగిన జాగ్రత్తలు చేపట్టాలన్నారు.  కార్యక్రమంలో వైసీపీ మండల కన్వీనర్‌ మెట్టా విష్ణువర్థన్‌రెడ్డి, ఎంపీపీ జీ సుగుణ, సర్పంచి బీ లక్ష్మి, ఉపసర్పంచి కే అనీతారెడ్డి, ఎంపీడీవో ప్రత్యూష, తదితరులు పాల్గొన్నారు. 
Read more