పెట్రోలు బంకు ఏర్పాటే చేసే స్థలం పరిశీలన
ABN , First Publish Date - 2022-02-13T04:29:48+05:30 IST
సంగంలోని వ్యవసాయ సహకార పరపతి సంఘం (సొసైటీ) ఆఽధ్వర్యంలో హెచ్‌పీ కంపెనీ ఏర్పాటు చేయనున్న పెట్రోలు బంకుకు కేటాయించిన స్థలాన్ని నెల్లూరు రూరల్ డీఎస్పీ హరినాథ్‌రెడ్డి శనివారం పరిశీలించారు.
సంగం, ఫిబ్రవరి 12: సంగంలోని వ్యవసాయ సహకార పరపతి సంఘం (సొసైటీ) ఆఽధ్వర్యంలో హెచ్‌పీ కంపెనీ ఏర్పాటు చేయనున్న పెట్రోలు బంకుకు కేటాయించిన స్థలాన్ని నెల్లూరు రూరల్ డీఎస్పీ హరినాథ్‌రెడ్డి శనివారం పరిశీలించారు. స్థలం పెట్రోలు బంకు ఏర్పాటుకు అనువుగా ఉందా లేదాని పరిశీలించి నివేదిక ఇవ్వడానికి డీఎస్పీ అనుమతి అవసరం. అ మేరకు ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సీఐ కోటేశ్వరరావు, ఎస్‌ఐ నాగార్జునరెడ్డి, పీఏసీఎస్ త్రిసభ్య కమిటీ చైర్మన్ పందిళ్లపల్లి శివకుమార్‌రెడ్డి, సొసైటీ సెక్రటరి దస్తగిరి, సిబ్బంది ఉన్నారు.