నెల్లూరు జిల్లాలో మహాశివరాత్రి వేడుకలు
ABN , First Publish Date - 2022-03-01T16:23:28+05:30 IST
నెల్లూరు: నగరంలోని మూలపాటి శివాలయం శ్రీ భువనేశ్వరీ మూలస్థానేశ్వర స్వామి ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందింది.
నెల్లూరు: నగరంలోని మూలపాటి శివాలయం శ్రీ భువనేశ్వరీ మూలస్థానేశ్వర స్వామి ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. ఇది పురాతనమైన ఆలయం. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా స్వామివార్లను దర్శించుకునేందుకు భక్తులు మంగళవారం తెల్లవారుజాము నుంచే పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. అలాగే నెల్లూరు జిల్లా వ్యాప్తంగా అన్ని శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. రామతీర్థం, కావలిలోని శ్రీదుర్గా భ్రమరాంబ సమేత మల్లేశ్వరస్వామి ఆలయం.. ఇలా శివాలయాలన్నీ శివనామస్వరంతో మారుమ్రోగుతున్నాయి. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు.