AP News.. నెల్లూరు: ఫిర్యాదు చేయడానికి వెళితే బాధితుడిపై ఎస్ఐ, సీఐ దాడి

ABN , First Publish Date - 2022-08-17T17:48:31+05:30 IST

ఆర్టీసీ హైర్ బస్సు డ్రైవర్ చంద్రశేఖర్, పొరుగింటివారితో ఇంటి స్థలం విషయంలో వివాదం జరిగింది. అయితే...

AP News.. నెల్లూరు: ఫిర్యాదు చేయడానికి వెళితే బాధితుడిపై ఎస్ఐ, సీఐ దాడి

నెల్లూరు జిల్లా (Nellore Dist.): వెంకటాచలం మండలం, ఎగువమిట్ట గ్రామంలో ఆర్టీసీ హైర్ బస్సు డ్రైవర్ చంద్రశేఖర్, పొరుగింటివారితో ఇంటి స్థలం విషయంలో వివాదం జరిగింది. ఫిర్యాదు చేయడానికి వెంకటాచలం పోలీస్ స్టేషన్‌కు చంద్రశేఖర్ వెళ్లగా అతనిపై ఎస్ఐ శివనాంచారయ్య, సీఐ జగన్మోహనరావులు దాడి చేశారు. ప్రస్తుతం చంద్రశేఖర్ జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్నాడు. ఆస్పత్రిలో బాధితుడిని. టీడీపీ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫిర్యాదు చేయడానికి వెళితే పోలీసులు విచక్షణరహితంగా దాడులకి పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఇంతకంటే ఘోరం మరొకటి ఉండదన్నారు. అధికారులు.. అధికారపార్డీకి అండగా వ్యవహారిస్తున్నారని, సామాన్యులకి న్యాయం చేయరా? అని సోమిరెడ్డి ప్రశ్నించారు.

Updated Date - 2022-08-17T17:48:31+05:30 IST