Navjeevan Express Rail: నవజీవన్ ఎక్స్‎ప్రెస్‎లో మంటలు తప్పిన పెద్ద ప్రమాదం..

ABN , First Publish Date - 2022-11-18T07:12:35+05:30 IST

అహ్మదాబాద్ నుంచి చెన్నైవెళ్తున్న నవజీవన్ ఎక్స్‎ప్రెస్(Navjeevan Express) పెద్ద ప్రమాదం

Navjeevan Express Rail: నవజీవన్ ఎక్స్‎ప్రెస్‎లో మంటలు తప్పిన పెద్ద ప్రమాదం..

Nellore: అహ్మదాబాద్ నుంచి చెన్నై(Ahmedabad to Chennai) వెళ్తున్న నవజీవన్ ఎక్స్‎ప్రెస్(Navjeevan Express) పెద్ద ప్రమాదం తప్పింది. నవజీవన్ ఎక్స్‎ప్రెస్ రైల్‎లో మంటలు చెలరేగాయి. పాంట్రీకారులో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. గూడూరు జంక్షన్ రైల్వే స్టేషన్‎లో(Gudur Junction Railway Station) మంటలను రైల్వే అధికారులు అదుపులోకి తీసుకువచ్చారు. సుమారు గంట పాటు గూడూరు రైల్వే స్టేషన్‎లో నవజీవన్ ఎక్స్‌ప్రెస్ నిలిచిపోయింది. రైల్వే వర్గాల అప్రమత్తంతో భారీ ప్రమాదం తప్పింది. ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో రైల్వే అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.

Updated Date - 2022-11-18T07:12:38+05:30 IST