ప్రతిభావంతులకు నగదు బహుమతులు
ABN , First Publish Date - 2022-03-06T03:42:21+05:30 IST
బుచ్చిలోని డీఎల్‌ఎన్‌ఆర్ హైస్కూల్లో అత్యుత్తమ ప్రతిభ విద్యార్థులకు శనివారం ప్రోత్సాహక నగదు బహుమతులు అందజేశారు.
బుచ్చిరెడ్డిపాళెం,మార్చి5: బుచ్చిలోని డీఎల్‌ఎన్‌ఆర్ హైస్కూల్లో అత్యుత్తమ ప్రతిభ విద్యార్థులకు శనివారం ప్రోత్సాహక నగదు బహుమతులు అందజేశారు. పాళెం మంగమ్మ ట్రస్టు సహకారంతో ఒక్కొక్కరికి రూ.5వేలు వంతున 10మందికి చెక్కులను, నగర పంచాయతీ చైర్‌పర్సన్ మోర్ల సుప్రజమురళి, హెచ్‌ఎం నాగపద్మ, వైస్ చైర్మన్లు లలితమ్మ, షాహుల్, కౌన్సిలర్లు పంపిణీ చేశారు. ముందుగా వైద్య ఆరోగ్యశాఖ అధ్వర్యంలో విద్యార్థులకు నులిపురుగుల నివారణ మాత్రలు మింగించారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు నాగరాజు, ప్రత్యూష, రహమత్‌బాషా, షకీలాబేగం, నస్రీన్, శివకుమార్‌రెడ్డి, మల్లారెడ్డి, సత్యం పాల్గొన్నారు.
సీజనల్ హాస్టల్ ప్రారంభం
బుచ్చి రామచంద్రాపురంలో సీజనల్ హాస్టల్‌ను ఎంఈ వో ధిలిప్‌కుమార్, చైర్‌పర్సన్ మోర్ల సుప్రజామురళి శనివారం ప్రారంభించారు. కార్యక్రమంలో వైస్ చైర్మెన్లు లలిత, షాహుల్, కౌన్సిలర్లు నాగరాజు, శ్రీదేవి, నస్రీన్, కృపాకర్ తదితరులు పాల్గొన్నారు.