గుర్తు తెలియని వృద్ధుడి మృతదేహం గుర్తింపు

ABN , First Publish Date - 2022-08-14T02:55:34+05:30 IST

స్థానిక తహసీల్దారు కార్యాలయ ఆవరణకు సమీపంలోని శిఽఽథిలమైన పోలీసుక్వార్టర్స్‌ గదుల్లో శనివారం ఓ గుర్తు తెలి

గుర్తు తెలియని వృద్ధుడి మృతదేహం గుర్తింపు
వృద్ధుడి మృతదేహం

కోవూరు, ఆగస్టు13 :  స్థానిక తహసీల్దారు కార్యాలయ ఆవరణకు సమీపంలోని శిఽఽథిలమైన పోలీసుక్వార్టర్స్‌ గదుల్లో శనివారం ఓ గుర్తు తెలియని వృద్ధుడి మృతదేహాన్ని స్ధానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.  ఆ వృద్ధుడు రెండు మూడు రోజల కింద మృతి చెంది ఉండవచ్చునని భావిస్తున్నారు. మృతదేహం చీమలు పట్టి కుళ్లిపోయే స్థితికి చేరుకుంది. వృద్ధుడి వయసు సుమారు 75సంవత్సరాలుగా భావిస్తున్నారు. తెల్లగళ్ళ లుంగీ ధరించిన వృద్ధుడ్ని గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.  ఘటనాస్థలాన్ని ఎస్‌ఐ డీ వెంకటేశ్వరరావు పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది.


Updated Date - 2022-08-14T02:55:34+05:30 IST